MDK: జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను సురక్షితంగా అధికారులు బయటకు తీసుకువచ్చారు. ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షం నీటి వరద కాలనీలోకి చేరడంతో హాస్టల్ ప్రాంగణమంతా జలమయమైంది. వెంటనే స్పందించిన పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తాడు సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.