NZB: జిల్లాలో ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా కామారెడ్డి నుంచి భీంగల్ వెళ్లే రహదారి కొండాపూర్ అడవి ప్రాంతంలో కల్వర్టు తెగిపోవడంతో కోతకు గురయ్యింది. అటుగా వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులు తెలిపారు. వర్షాల కారణంగా అడవి ప్రాంతంలోని వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.