NZB: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(GGH) భవనం మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2.76 కోట్లు మంజూరు చేసినట్లు GGH సూపరింటెండెంట్ డాక్టర్ పీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ నిధులతో మరుగుదొడ్లు, డ్రెయినేజీలు, తలుపులు, కిటికీలు, భవనం ముందు భాగంలో మరమ్మతులు చేపట్టడంతోపాటు పాలియేటివ్ కేర్ సెంటర్ అభివృద్ధి, ల్యాబ్ మరమ్మతులు, టీహబ్ విస్తరణ పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.