MNCL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలోని ఐబి చౌరస్తాలో బుధవారం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కాలుష్యం పెరిగిపోతుందని, పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు.