JGTL: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో కాకతీయుల కాలంలో వెలికి తీసిన గణపతి రాతి విగ్రహం ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. చెరువు తవ్వే క్రమంలో లభించిన ఈ గణనాథుడు గ్రామంలోని చెరువు సమీపంలో కలువుదీరాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్విరామంగా పూజలు స్వీకరిస్తున్నాడు. కాగా, గ్రామస్తులు ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేస్తున్నారు.