W.G: వడలి గ్రామానికి చెందిన రవికుమార్(32) విదేశాల్లో ఉద్యోగం అనుకూలంగా లేకపోవడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చారు. సుమారు రూ. 4 లక్షల అప్పు మిగిలి ఉండటంతో తీవ్ర మనస్తాపానికి గురై, ఇంట్లోనే కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.