కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరుడి ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు బుధవారం ఉదయం నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని కలెక్టర్ మహేష్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ఈవో దుర్గాభవాని, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాన్ని అందించారు.