WGL: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదాలకు దారితీసే వస్తువులను మండపం దగ్గర పెట్టకూడదని, ఎమర్జెన్సీ లైట్లను మండపంలో తప్పనిసరిగా ఉంచుకోవాలని, నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచనలు చేశారు.