జమ్మూలో యాత్రికుల మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్, లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హాకు ఫోన్ చేసి మాట్లాడారు. కేంద్రం నుంచి సహాయ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా.. జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో 30 మంది చనిపోయిన విషయం తెలిసిందే.