MBNR: జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో వర్షంలో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. నవాబుపేట మండల కేంద్రంలోని యూరియా కేంద్రం వద్ద రైతులు బుధవారం ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కొద్ది రోజులుగా గరిష్ఠ స్థాయిలో రైతులకు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.