తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు చేశారు. అసలు రేవంత్ రెడ్డి ఎవరని.. బీహార్లో ఆయనకు ఏం పని అని ప్రశ్నించారు. బీహార్ రాజకీయాల్లో రేవంత్ జోక్యాన్ని ప్రశాంత్ కిషోర్ తప్పుబట్టారు. తెలంగాణ ఎన్నికల సమయంలో బీహార్ ప్రజలను రేవంత్ రెడ్డి అవమానించారని.. ఇప్పుడు అదే బీహర్ ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.