GNTR: కొల్లిపర (M) అత్తోటలో మంగళవారం ఒంటరిగా ఉన్న వృద్ధురాలు బుల్లెమ్మపై దాడి చేసి బంగారు నగలు అపహరించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆమెను కొట్టి 19 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని CC కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.