MNCL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం మంచిర్యాలలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కొత్తపల్లి రమేష్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని 500 మట్టి గణపతి విగ్రహాలను భక్తులకు అందజేశారు.