ELR: మంత్రి కొలుసు పార్ధసారధి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. ఎరువులు, ముఖ్యంగా యూరియా లభ్యత, సరఫరాపై సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారన్నారు. త్వరలో రైతులకు ఎటువంటి కొరత లేకుండా ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఎరువుల కోసం రైతులు పడిగాపులు పడే పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.