కృష్ణా: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావదేవరపల్లి సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ తెలిపారు. బుధవారం నాగాయలంక ప్రధాన కూడలిలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శత జయంతి నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.