VKB: వినాయక చతుర్థి పురస్కరించుకొని జిల్లా ప్రజలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. విజ్ఞాలను తొలగించి తలపెట్టిన కార్యాలను విజయవంతంగా పూర్తి చేయడానికి అనుగ్రహించే వినాయకుణ్ణి ఆశీస్సులతో అందరూ సుఖశాంతులతో జీవించాలన్నారు. నవ రాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజ మండపాల దగ్గర అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.