E.G: ప్రతి ఒక్కరూ మట్టి గణపయ్యను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కొవ్వూరు భాష్యం పాఠశాల హెచ్ఎం.కోటేశ్వరీ దేవి అన్నారు. ఈరోజు పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో వివిధ ఆకృతుల్లో గణపతి ప్రతిమలను తయారు చేయించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.