టీమిండియా వ్యవహారాల్లో విదేశీ ప్లేయర్లు జోక్యం చేసుకోవడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ‘భారత క్రికెట్ గురించి పూర్తి జ్ఞానం లేని విదేశీ ఆటగాళ్లు ఆసియా కప్ జట్టు ఎంపిక గురించి మాట్లాడుతున్నారు. వారికి టీమిండియా గురించి ఆందోళన ఎందుకు. భారత్ మాజీ క్రికెటర్లు ఎప్పుడు విదేశీ జట్ల ఎంపికలపై మాట్లాడరు’ అని చెప్పుకొచ్చారు.