TG: నిజామాబాద్-కామారెడ్డి మార్గంలో భారీ వరదల కారణంగా రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఎల్లారెడ్డిలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి NDRF అధికారులు హెలికాప్టర్ కోరారు. NDRFను అప్రమత్తం చేశామని, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ అన్నారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.