హానికరమైన కంటెంట్‌ను వ్యాప్తి చేసే ఇన్ఫ్లుయెన్సర్లు భావప్రకటన స్వేచ్ఛ వెనుక దాక్కోలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 19 హక్కులు కొన్ని బాధ్యతలకు, పరిమితులకు లోబడి ఉంటాయని పేర్కొంది. తప్పుదోవ పట్టించే లేదా హానికరమైన పోస్టులకు ఇన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీగా ఉండాలని, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల దుర్వినియోగాన్ని అరికట్టాలని తేల్చి చెప్పింది.