కేరళ కొచ్చిలో IT ఉద్యోగిని కిడ్నాప్ కేసులో తమిళ హీరోయిన్ లక్ష్మి మీనన్‌తో పాటు మరో ముగ్గురిపై ఎర్నాకులం నార్త్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి ఓ రెస్టారెంట్ వద్ద జరిగిన వాగ్వాదం తర్వాత లక్ష్మి మీనన్ గ్యాంగ్ బాధితుడిని వెంబడించి.. కారులో లాక్కొని దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. లక్ష్మి పరారీలో ఉండగా.. మిథున్, అనీష్, సోనామోల్ అరెస్ట్ అయ్యారు.