KRNL: వినాయక చవితి పండగను పురస్కరించుకొని కర్నూల్ కలెక్టరేట్లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి బుధవారం జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విఘ్నాలు తొలగి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకటనారాయణమ్మ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు.