కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 2030లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహణకు బిడ్ వేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బిడ్ ఆమోదం పొందితే గుజరాత్ ప్రభుత్వానికి గ్రాంట్-ఇన్-ఎయిడ్ మంజూరు చేయనుంది. అహ్మదాబాద్లో ప్రపంచస్థాయి స్టేడియంలు, ట్రైనింగ్ సెంటర్లు ఉన్నట్లు పేర్కొంది. కామన్వెల్త్లో 72 దేశాల క్రీడాకారులు పాల్గొననున్నారు.