W.G: వీరవాసరం మండలం కమతాలపల్లి నుంచి వెంప, భీమవరం వెళ్లే రహదారి పూర్తిగా దెబ్బతింది. చిన్న వర్షానికే రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో నీరు నిలిచి చెరువుల్లా మారుతున్నాయి. రాత్రిపూట ప్రయాణం మరింత కష్టంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.