KNR: కరీంనగర్ కలెక్టరేట్లో నవరాత్రి ఉత్సవాలకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో ఏర్పాటుచేసిన వినాయకుని వద్ద జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, ఏవో సుధాకర్, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు.