ప్రకాశం: చంద్ర శేఖర్ పురం మండలంలోని శీలంవారిపల్లి గ్రామంలో ఉన్న కదిరి బాబురావు వ్యవసాయ కళాశాలలో బుధవారం వినాయక చవితి పండుగ ను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. వినాయక మండపంలో కళాశాల విద్యార్ధులు, అధ్యాపకులు పాల్గొని వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు కళాశాల కరస్పాండెంట్ కదిరి పార్థసారథి ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజన వసతి సమకూర్చారు.