GNTR: తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల త్రిముఖ మట్టి గణపతి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్ 2న 3 వేల మందికి అన్నదానం ఉంటుందని, సెప్టెంబర్ 6న నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు.