MBNR: ఆ గణనాథుడి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని మాజీమంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ కాంక్షించారు. వినాయక చవితిని పురస్కరించుకుని బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఘననాథుడి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ ఆసుపత్రి రెసిడెంట్ డైరెక్టర్ రామ్ రెడ్డి పాల్గొన్నారు.