ఆపరేషన్ సింధూర్ సాంకేతిక ఆధారిత యుద్ధానికి అద్భుతమైన నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘యుద్ధాన్ని నివారించాలంటే ద్వైపాక్షిక చర్చలు కీలకం. భారత్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకునే దేశం కాదు. ఎవరిపైనా దురాక్రమణకు పాల్పడలేదు. మనల్ని సవాల్ చేసిన వారికి తగిన బుద్ధి చెబుతాం. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాం’ అని అన్నారు.