BDK: మణుగూరు మండలం కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన శ్రీ శాకంబర గణపతి నవరాత్రుల మహోత్సవానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నియోజకవర్గ ప్రజలకు గణేశుని ఆశీస్సులు ఉండాలని వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.