WGL: కాంగ్రెస్ పార్టీలో ఎనిమిది ఎమ్మెల్యేగా పనిచేసిన కొండేటి శ్రీధర్ ఇప్పుడు బీజేపీకి వత్తాసు పలకడం విడ్డూరంగా ఉందని వర్ధన్నపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అప్పిడి రాజిరెడ్డి తెలిపారు. బుధవారం వర్ధన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజల కోసం అసెంబ్లీలో ఎన్నిసార్లు మాట్లాడారో లెక్కలు తీద్దామా అంటూ ప్రశ్నించారు.