KMM:నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ నేతలతో కలిసి వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.