ప్రకాశం: కనిగిరి పట్టణంలో వినాయక చవితి పండుగను బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలోని పలు వినాయక స్వామి విగ్రహాల వద్దకు వైసీపీ ఇంఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గణనాథుడి ఆశీస్సులు నియోజకవర్గం ప్రజలందరిపై ఉండాలని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.