VZM: ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామంలో విఘ్నేశ్వరుడికి ఎమ్మెల్యే లలితకుమారి బుధవారం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. విఘ్నాలను తొలిగించి సద్ బుద్ధుని ప్రసాదించే వినాయకుడి జ్ఞానం, విజాయానికి సంకేతం అన్నారు. వినాయక పర్వదినం సందర్భంగా నియోజవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వినాయకుని వేడుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపలని ఆకాంక్షించారు.