అన్నమయ్య: సెప్టెంబర్ 1న రాజంపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్న నేపథ్యంలో, అధికారులు బుధవారం పలు ప్రాంతాలను పరిశీలించారు. అన్నమయ్య కలెక్టర్ శ్రీధర్ చామకూరి, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, ఇతర అధికారులు హెలిప్యాడ్, బహిరంగ సభ, కార్యకర్తల సమావేశం కోసం కొత్త బోయిన పల్లె, తాళ్లపాక, ఎన్టీఆర్ కాలనీ వంటి అనువైన స్థలాలను పరిశీలించారు.