TG: మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మూసీ రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ను, అలాగే ‘గేట్ వే ఆఫ్ హైదరాబాద్’, ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించిన వివిధ డిజైన్లను పరిశీలించారు. ఈ ప్రాజెక్టులకు DPRలను త్వరగా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.