SRCL: కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామం నుంచి సుద్దాల ఎక్స్ రోడ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. గ్రామ ప్రజల దశాబ్ద కల సాకారమవుతుంది. ఈ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రూ. 1 కోటి 30 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంలో గ్రామ యువకులు, పెద్దలు అందరూ కలిసి ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.