MDK: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రేగోడ్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని మర్పల్లి గ్రామానికి చెందిన యువకుడు బండి హరికృష్ణ ఇవాళ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. మండల కేంద్రమైన రేగోడ్లోని మహావీర్ మీ సేవలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హరికృష్ణ అకాల మరణం బంధుమిత్రులు, సహచరులు, గ్రామస్థులను కన్నీటి పర్యంతం అయ్యారు.