PLD: వినాయక చవితి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, ఆయన సతీమణి లీలావతి దంపతులు వినుకొండ కొత్తపేట గణేశ్ మండపంలో బుధవారం జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పూజారులు వారిని మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడి భక్తులకు, నిర్వాహకులకు గణేశ్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు.