TPT: శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొట్టే సాయి మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా, గత 11 సంవత్సరాలుగా శ్రీకాళహస్తిలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ సంరక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు.