HYD: నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఇప్పటికే వర్షం కురుస్తుంది. సుమారు ఒంటిగంట వరకు వర్షం కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో మోస్తారు వర్షం కొనసాగుతుందని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. మిగతా ప్రాంతాలు అన్నిటిలోనూ ఆరెంజ్ అలెర్ట్ ఉందని, అవసరమైతే కానీ బయటకు వెళ్లొద్దని సూచించారు.