కృష్ణా: మట్టి గణపతిని పూజించి జల కాలుష్యాన్ని అరికట్టాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ కోరారు. బుధవారం అవనిగడ్డ బస్టాండ్ సెంటరులో కొల్లిపర బదరి వెంకటనారాయణ మెమోరియల్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంయుక్త ఆధ్వర్యంలో వినాయకచవితి సందర్భముగా మట్టి గణపతి విగ్రహాలు పంపిణీని చేశారు. గంటా ప్రణీత్ -రాధారాణి దంపతులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.