SKLM: కవిటి మండలం బొరివంకలో యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏటా విభిన్న రూపాల్లో గణపతులు చేయడం ఆనవాయితిగా వస్తోంది. గతంలో వరి నారు గణపతి, నారికేళ గణపతి, వనమూలికల గణపతి, హరిద్ర గణపతి, పామాయిల్ గణపతి, గోధుమ నారు గణపతిని తయారు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఇలా 20 ఏళ్ల పాటు గణేశుడి ప్రతిమలను తిరుపతి అనే వ్యక్తి అమర్చుతున్నారు.