TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగ ఆలయ ప్రాంగణంలోని ప్రధాన గణపతికి విశేష పూజలు జరిగాయి. ముందుగా కలశ స్థాపన గావించి సంకల్పం చేసి పాలు, పెరుగు, తేనె, గంధం వంటి సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు.