KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో నేడు గురువారం జరగాల్సిన బీఎడ్, ఎంఎడ్ పరీక్షలను భారీ వర్షాల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. సురేష్ కుమార్ ప్రకటించారు. మిగతా పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. వాయిదా వేసిన పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులు గమనించాలని కోరారు.