NLR: జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా నెల్లూరు మగుంట లే అవుట్ లంబోదర సెంటర్లో మూడు తొండాల వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ ప్రతిమ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడ ఈ నెల 30న జరగనున్న లడ్డూ వేలంపాటకు సినీ ప్రముఖులు ఆదిపినిశెట్టి, పూజిత పొన్నాడ రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.