PDPL: అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. గురువారం ఉదయం 40 గేట్లు ఎత్తి 4 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు, మత్స్యకారులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.