SRCL: భారీ వర్షాల కారణంగా ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి, జవారిపేట, నర్సక్కపేట గ్రామాల మధ్య బిక్కవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కరీంనగర్ నుంచి ఇల్లంతకుంటకు నడిచే ఆర్టీసీ బస్సులకు అంతరాయం ఏర్పడింది. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం గురువారం తాత్కాలిక మార్గమార్పు ఏర్పాటు చేశారు. ఇకపై బస్సులు పొత్తూరు – కందికట్కూరు మీదుగా ఇల్లంతకుంటకు చేరనున్నాయి.