GDWL: జీలలో గొనుపాడు సమీపంలోని బ్రిడ్జి పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జి ప్రహరీ గోడ బలహీనపడింది. ఇది రాయచూరు వైపు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా ప్రహరీ గోడలను పునరుద్ధరించాలన్నారు.