AP: బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి.. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. సహాయక చర్యలకు NDRF, SDRF సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.